కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లోకి జంప్
నేడు సిఎం సమక్షంలో చేరేందుకు రంగం సిద్దం
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి ): తెలంగాణ కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండివ్వనున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా కారెక్కనున్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌లో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌కు బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేటప్పుడు దామోదర్‌రెడ్డి ఎంతగానో విభేదించారు. తన మాట లెక్కచేయకుండా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన అలకను గుర్తించిన డీకే అరుణ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె చేసిన ప్రయత్నం సఫలం కాలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నాగంను డికె కూడా విమర్శించారు. నాగం పెద్ద బలమైననేత కాదని అన్నారు. మొత్తంగా నాగం రాకను విభేదించిన ఎమ్మెల్సీ టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.




