విద్యుద్ఘాతంతో భార్యాభర్తలు మృతి
హైదరాబాద్,జూన్25(జనం సాక్షి ): నటుడు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న భార్యాభర్తుల దుర్మరణం చెందారు. అర్థరాత్రి విద్యుత్ తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల సినీహీరో నాగార్జునకు చెందిన వ్యవసాయం క్షేత్రంలో దంపతులు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ వైరును గమనించకపోవడంతో అది తగిలి విద్యుదాతానికి గురయ్యాడు. భార్య దుర్గ గమనించి భార్యను కాపాడే ప్రయత్నం చేయగా, ఆమె కూడా షాక్కు ఇద్దరూ తనువు చాలించారు. మరణంలోనూ ఆ జంట దాంపత్య బంధాన్ని వీడలేదు. విద్యుదాఘాతానికి గురైన భర్తను కాపాడబోయి భార్య కూడా తనువు చాలించిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు ఇక్కడ పనిచేస్తున్నారు.
——




