నాటూసారాపట్టివేత ఇద్దరిపై కేసు
గుడిహత్నూర్: జూలై 12 (జనం సాక్షి) అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గారుడే గోపీనాథ్,
గోరట్కర్ ఓంకార్ ఇద్దరు యువకులు నేరడిగొండ తండా కు చెందిన గణేష్ నుండి 10 లీటర్ల గుడుంబా కొనుగోలు చేసుకుని గుడిహత్నూర్ కి వస్తుండగా మహాత్మా గాంధీ మెమోరియల్ పాఠశాల వద్ద పట్టుకుని నాటుసారాను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.