Thursday, 5 November 2026

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం -రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి -బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోలి వేణుమాధవ్

 

వేమనపల్లి,జులై12,(జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీమండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్ ను కించపరిచినందుకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసినట్టు తెలిసారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్​ను విమర్శించడం అర్ధరహితమని,అలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ లు,ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.