పారిశుద్ధ పనులను అడ్డుకున్న పంచాయతీ కార్మికులు
గుడిహత్నూర్: జూలై 12( జనం సాక్షి )గత ఆరు రోజులుగా తమ దిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తుండగా గుడిహత్నూర్ పంచాయతీ పాలకవర్గం బుధవారం ఆదిలాబాద్ నుండి కూలీలను తెప్పించి పారిశుద్ధ పనులను చేపిస్తుండగా విషయం తెలుసుకొన్న సమ్మెలో ఉన్న పంచాయితీలు కార్మికులు పనులను అడ్డుకున్నారు చెత్తను తీసుకవెళ్తున్న ట్రాక్టర్ ముందు కూర్చుంది నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే గుడిహత్నూర్ పంచాయతీలో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేయించడం సరికాదన్నారు మండలంలో అన్ని పంచాయతీ ల సర్పంచులు తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు గుడిహత్నూర్ పంచాయతీ పాలకవర్గం తమకు మద్దతు తెలపాలని వారు కోరారు ఈ విషయం తెలియగానే ఎస్సై ప్రవీణ్ కుమార్, సర్పంచ్ జాదవ్ సునీత అక్కడి చేరుకుని కార్మికుకులను సముదాయించారు దింతో వారు శాంతించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని డిమాండ్ చేశారు.