Wednesday, 4 November 2026

బోయిన్ పల్లి మార్కెట్లో సీక్రెట్ గా సి21లో కలెక్షన్ చేసింది ఎవరు

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 13 బోయినపల్లి 2014 జూన్2వతారీకుతెలంగాణఆవిర్భవించింది,ఆవిర్భించుటతో మొదలు చేసుకున్న రాష్ట్రంలో రాక్షసిపాలన కొన సాగుతుందంటే అతిశయోక్తి లేదు ఏ శాఖ లో చూసిన ఏముంది,అంతా అవనీతి గబ్బు రాజకీయ నాయకుల చెప్పగానే చెప్తున్న రాజకీయ నాయకులు వేషాలు119నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకుకోట్లలోదోపిడీజరుగుతుంది,అడ్డుకుంటున్న మేధావుల్ని అడ్డంగా తప్పిస్తూ వారి దాటి సు సాధ్యం చేసుకుంటా లక్ష్యం చేదిస్తున్నారు.ఇక అసలు విషయాని కొస్తే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ వేదిక ఏదైనా ఏ సమావేశంలో అయినా నోట వచ్చ మొట్ట మొదటి మాట రైతే రాజు,రైతు సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్ని పదే పదే చెబుతూ రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ కానీ అదే రైతు సుఖంగా ఉన్నాడంటే ! ఉదాహరణకి రైతుబంధు, రైతు బీమా రెండు మూడు పథకాల ముందు పెట్టి రైతులకు ఉండ వలసిన సబ్సిడీ తొలగించి వారికి కృత్రిమ ఇబ్బందులు సృష్టిస్తున్న ప్రభుత్వ చిరునామాగా మారింది, ఈ ప్రభుత్వం సేద్య బిందువు సాగు పంటల కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.7000/ రూపాయలు దాన్ని తొలగించడంతో రైతన్నలకి రూ.20,000/ రూపాయలు ఖర్చుతో నడ్డి ఇరుగుతుంది పలుమార్లు తెలంగాణ రైతు సంబంధిత శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు కో కోలలు మంత్రి స్పందన మాత్రం శూన్యం, కష్టాలు విషయానికొస్తే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్ లో జరిగే వ్యాపారానికి సమతుల్యంగా అధికారుల అవనీతి దందా జోడయింది అహర్నిశలో కష్టపడి రైతన్న తీసుకొచ్చిన పంట గిట్టబాటు ధర కాక, బెరగాళ్లు వ్యాపారం జరగక సందట్లో సడేమీయగా యార్డ్ అధికారులు చిన్న చిట్కా తప్పులను భూత ఆద్దంలో చూస్తూ అందిన కాడికి దోసెస్తూ మూడేళ్లు కోట్లు కొల్లగొట్టి శ్రీమంతులైనారు. మరో విషయం ఏమిటంటే మార్కెట్ యార్డ్ లో సి.21 టమోటా బేరగాడి గత కొంతకాలం సంబంధిత రైతుకి తెల్ల చిట్టి ఇస్తున్న సందర్భంలో గ్రేడ్ వన్ అధికారి పట్టుకున్నారు. చర్యలు తీసుకోవలసిన అధికారే చెయ్యి చాపితే ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంది, ఈవిస్వశ్వనీయ విశ్వత సమాచారం మేరకు కొంత గత కొంత కాలం కితం అయ్యగారు బెదిరింపులకు అదిరిపోయి( తత్పట్టి పుస్తకాన్ని లాక్కోవడంతో బెదిరిన వ్యాపారి) వ్యాపారి అధికారికి అక్షరాల 50 వేల రూపాయలు ఆమ్యామ్యులు సమర్పించుకున్నాడని సమాచారం ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఇవే ఆగడాలు ఈ అవనీతి సొమ్ములో యార్డ్ లో ఉన్నత అధికారులు కూడా లక్షల సొమ్ము అందుతుంద ? నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకమండలి కి కూడా ఈ పాపం తెలియకుండా ఇతర యాత్ర సమస్యలు వారి దృష్టికి పడకుండా జాగ్రత్త పడడం మార్కెట్ అధికారుల తెలివికి నిదర్శనం మార్కెట్లో కమిషన్ ఏజెంట్లలో కాస్తంత లౌక్యం ఉన్నవాళ్లు సమస్యల పట్ల అధికార దృష్టికి తీసుకెళ్లతే,ఏయ్ నా గురించి నీకు తెలుసా ? నాకు చెప్పేంత మొనగాడివో నేను ఐదు మంది మంత్రుల దగ్గర, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు వద్ద విధులు నిర్వహించిన అనుభవం ఉంది ఎక్కువ మాట్లాడకు ఏం చేయాలో మాకు తెలుసు అంటూ జవాబు డాటా వేస్తున్న ఉన్న శ్రేణి అధికారి బోయిన్ పల్లి మార్కెట్లో అవినీతి ఏరులై పారుతున్న విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు, జరిగిన మూడున్నర ఏళ్లలో బోయినపల్లి మార్కెట్ కి పెద్ద ఎత్తున అవినీతి మరక ఏర్పడిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ అధికారైన రెండేళ్లు విధులు నిర్వహిస్తాడు గాని ఈ అధికారికి స్పెషల్ ఏంటో ? మూడున్నర ఏళ్ళు జరుగుతున్న కూడా స్థానచలనం లేకపోవడం అయ్యగారికి ఉన్నత శ్రేణి అధికారు కి మార్కెటింగ్ శాఖ అధికారుల అండదండలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ సీఎం తీసుకొని నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో కమిటీ చైర్మన్ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవడం ఇదే మొట్టమొదటి చర్యగా భావిస్తున్నారు అన్ని నిపుణులు అలాంటి కల్వకుంట్లచంద్రశేఖర రావు రాజ్యంలో ఇలాంటి చెడ్డ పురుగులు ఉండడం ఎలాంటి నిర్ణయాలకు దారితీస్తుందో చూడాల్సిందే. పైగా కాస్త ఫోకస్ పెడితే తెలంగాణ సర్కార్ కి కీర్తి ప్రతిష్టకు భంగం కలక్కుండా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.