Wednesday, 4 November 2026

నాబిశిల (బొడ్రాయి)ప్రతీష్ఠ మహొత్సవానికి భారీ గా ఆర్థిక సహాయం అందించిన టిపిసిసి నాయకులు

 కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 24 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ మండల పరిధిలో గల బొల్లి గుట్ట తండా,కొండ బీమనపల్లి. గ్రామాలలో ప్రతీష్ఠింప బడుతున్నటువంటీ నాబిశిల ప్రతిష్ఠ మహోత్సవానికి తన వంతు సహాయంగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ ఈ రొజు 50000/రూ ఆర్థిక సహాయం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ దైవచింతన తోనె మానసిక ప్రశాంతత లభిస్తుంది.అని గ్రామానికి నాబిశిల ప్రతిష్ఠాపన చాలా అవసరం అని ఆ దేవుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో శుబిక్షంగా.ఆనందంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతొ మెలగాలని అన్నారు.అలాగే మీకు ఏ విధమైన ఆపదా వచ్చిన నేను వున్నానని మీ అండగా వుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ రాజు,దేవుజీ,సామియ, నాగేష్,బాలు,చందర్ సాయి, శివ మరియు స్థానిక యువకులు బీల్యా నాయక్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు