Monday, 2 November 2026

నామపూర్ లో.. గడప గడపకు గజరాజు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ చేపట్టిన గడప గడపకు గజరాజు కార్యక్రమం పెగడపెల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో కొనసాగుతుంది. బిఎస్పీ గ్రామ అధ్యక్ష ఉపాక్షుడు తుడుముల అనిల్, ఆరెల్లి వికాస్, నియోజకవర్గ కోశాధికారి దీకొండ రాజు కుమార్, మండల అధ్యక్షుడు గొడుగు నరేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్ మరియు గ్రామశాఖ అధ్యక్షుడు తుడుముల అనిల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో గడప గడపకు వెళ్లి పెద్దలకు, మహిళలకు, యువకులకు, విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు బిఎస్పీ సిద్ధాంతం, కాన్షిరాం పనివిధానం, డాక్టర్ ఆరెస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేకత, వారి పదవి త్యాగం, ఓటు విలువ గురించి మరియు తరాలుగా సమాజానికి, సంపదకు, రాజకీయాలకు దూరమై ఆర్థిక, రాజకీయ అసమానతలతో అస్తవ్యస్థమైన ఎస్సీ ఎస్టీ, బీసీ పేదవర్గాలకు జరుగుతున్న అన్యాయాలను వివరించి.ఈ సమస్యలన్నింటికి బహుజన రాజ్యాధికార సాధనే పరిష్కారమని., కనుక ప్రజలంతా చైతన్యమై ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై ఓటువేసి నక్క విజయ్ అనే నన్ను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నక్క గంగాధర్, వెల్గటూర్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల అధ్యక్షుడు బచ్చల స్వామి, కల్లెపెల్లి తిరుపతి, గజ్జెల స్వామి, సీనియర్ నాయకుడు కొత్తూరి శంకర్, మండల ఉపాధ్యక్షుడు దీకొండ అజయ్, ఎస్ఎస్ యు జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అజయ్ మరియు నాయకులు సిహెచ్ అజయ్, ఎనగందుల నరేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి ఎనగందుల విష్ణు, వినోద్, హరీష్, శేఖర్, ప్రేమ్ సాగర్, విష్ణు, మహేందర్, కార్యదర్శి ప్రజాపతి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎస్ యు, బివీఎఫ్ నాయకులు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.