Wednesday, 4 November 2026

నా కొడుకుని విలన్‌ని చేయొద్దు: ఆదిత్య పంచోలి

ముంబాయి : బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కుమారుడిపై అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సూరజ్‌ తప్పు చేసినట్లు రుజువైతే అతన్ని నింధించడంలో తపులేదన్నారు. జియాఖాన్‌ ఆత్మహత్య నేపథ్యంలో రచయిత శోభా దే తన బ్లాగులో ఆదిత్య, సూరజ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అదిత్య పై విధంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *