Wednesday, 4 November 2026

ప్రమాదవశాత్తు తండ్రిని చంపిన చిన్నారి

ప్రెస్‌కాట్‌ వ్యాలీ (అమెరికా): నాలుగేళ్ల చిన్నారి తన తండ్రిని ప్రమాదవశాత్తు చంపిన సంఘటన అమెరికాలోని ప్రెస్‌కాట్‌ వ్యాలీలో చోటుచేసుకుంది. ఉత్తర అరిజోనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రెస్‌కాట్‌ వ్యాలీ హోమ్‌లో నివసించే ఓ 35 ఏళ్ల తండ్రి తన నాలుగేళ్ల కొడుకు చేతిలో ప్రమాదవశాత్తు హత్యకు గురయ్యాడు. చేతిలో పిస్టల్‌ పట్టుకొని సరదాగా తండ్రికేసి గురిపెట్టాడు. అది నిజంగానే పేలడంతో తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతుణ్ని జస్టిన్‌ స్టాస్‌ఫీల్డ్‌ థామస్‌గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *