Saturday, 7 November 2026

నా ప్రయాణం ప్రజా నాయకుడు మాలోత్ నెహ్రు నాయక్ తోనే

నా ప్రయాణం ప్రజా నాయకుడు మాలోత్ నెహ్రు నాయక్ తోనే
-కాంగ్రెస్ పార్టీ కురవి మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుగులోత్ నవీన్ నాయక్

కురవి డిసెంబర్19/ జనం సాక్షి న్యూస్:డోర్నకల్ నియేజకవర్గ ప్రజల కష్టాలను పాలుపంచుకుంటున్న డోర్నకల్ నియేజకవర్గ బాద్యులు,ఎమ్మెల్యే అభ్యర్థి మాలోత్ నెహ్రు నాయక్ తోనే నా ప్రయాణం సాగుతుంది అని కురవి మండల సోషల్ మీడియా ఇంచార్జి గుగులోత్ నవీన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ చరిత్రలో నెహ్రు నాయక్ లాంటి రాజకీయ నాయకుని చూడలేదని …..డోర్నకల్ నియేజకవర్గం లో ఎవరికి కష్టం వచ్చిన ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటూ సహాయం అందిస్తున్నారని డోర్నకల్ నియేజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ప్రతిష్టింస్తునా దేవస్థానాలకు, ప్రజలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.ఇలాంటి నాయకున్ని ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే గా గెలిపిస్తే మరొన్నే సేవలు అందించాడానికి సిద్ధంగా ఉన్నారని కష్టాలు వస్తే ముఖం చాటేసుకొని పొతున్న బంధువులు ఉన్న ఈ సమాజంలో ఎలాంటి బంధం లెకున్న ప్రజలకు ఇంతాల సహాయం చేస్తున్నారు ఆ గుండె ఎలాంటిదో అర్ధం చేసుకోవాలని అన్నారు.నా ప్రయాణం ప్రజల చేత జేజేలు అందుకున్న జననేత మాలోత్ నెహ్రు నాయక్ తోనే నా ప్రయాణం సాగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో సొషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.