Saturday, 7 November 2026

మృతుల కుటుంబాలను పరామర్శించిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి

 

మునగాల, డిసెంబర్ 19(జనంసాక్షి): ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కుటుంబాలను కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. మునగాల మండల పరిధిలోని తాడువాయి, తిమ్మారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన మాతంగి నాగయ్య, మాల్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం బాధాకరమని కోదాడ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. అనంతరం మృతుల ‌చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ‌అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు ఎంపిపి భర్త బి. కోటయ్య, శశిధర్ రెడ్డి, తాడ్వాయి సింగిల్ ఏంటో డైరెక్టర్ పత్తిపాక లక్ష్మీనారాయణ, కోట వెంకటేశ్వర్లు, మాంతగి సైదులు, రాంబాబు, అంజి, శశీధర్ రెడ్డి యువసేన నాయకులు రాయి రవి, గోవింద్ గౌడ్, నరేందర్ రెడ్డి, సైదిరెడ్డి, సంజీవరెడ్డి, రామచంద్రారెడ్డి, డి. లింగయ్య, ఎల్లావుల సైదులు తదితరులు పాల్గొన్నారు