నిబంధనలకు నీళ్లు వదిలిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు..
అధికారులకు వ్యాపారులకు వాగ్వివాదం..
ఫోటో రైటప్ : కాల్వ వంతెనను ధ్వంసం చేసిన అధికారులు…
జనం సాక్షి నర్సంపేట
పట్టణంలోని అంగడి సెంటర్ కు దూరంలో ఉన్న మాదన్నపేట కాల్వ పై అక్రమ వెంచర్ కి సమీపంలో వంతెనను నిబంధనల ప్రకారం లేకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు.
నగర పంచాయతీ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం మదన్నపేట పెద్ద కాల్వపై రహదారి మార్గం కోసం నిర్మించిన దారిని మున్సిపాలిటీ అధికారులు ఫిర్యాదు మేరకు ధ్వంసం చేశారు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ ప్రభుత్వ అనుమతులు లేకుండా క్రయవిక్రయాలు చేపట్టడంతో రహదారి మార్గం కోసం సాగునీటిపారుదల అధికారుల అనుమతులు లేకుండా నిర్మించడాన్ని ఐబి అధికారులు తప్పుపడుతున్నారు. ఐబీ డీఈ ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ అధికారులు అక్రమంగా వెలిసిన వెంచర్‌ను పరిశీలించి ప్రభుత్వ అనుమతులు లేకపోవడాన్ని రియల్ వ్యాపారులతో వివరణ కోరగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులకు వ్యాపారులకు మధ్య వాగ్ వివాదం జరిగింది.
నీటిపారుదల శాఖ డి ఈ రాంప్రసాద్
ఫిర్యాదు మేరకే రహదారి మార్గాన్ని ధ్వంసం చేశామని వివరించారు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు మున్సిపాలిటీ నుండి కానీ నీటిపారుదల శాఖ నుండి కానీ అనుమతులు లేవని వివరించారు అక్రమంగా ఇలాంటి నిర్మాణాలు జరిగినా ప్రభుత్వపరమైన చర్యలు చేపడతామని తెలిపారు అధికారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వివాదం జరగదా స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. సెంటర్ వెనుక భాగంలో గల భూమికి ధర ఎక్కువగా పలకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై అనేక విమర్శలు వినవస్తున్నాయి. అనుమతులు లేని వ్యాపారులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపాలిటీ కమిషనర్ వివరణ..
నిబంధాలకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ అక్రమ వెంచర్ వెలిసిందని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాదనపేట రహదారి కోసం నిర్మాణం చేపట్టడం అక్రమమని డి ఈ ఫిర్యాదు మేరకు అధికారులు కాల్వ పై ఉన్న రహదారిని ధ్వంసం చేసినట్లు వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు.




