Wednesday, 4 November 2026

నిండుకుండల్లా జలాశయాలు

 

వరద ఉధృతితో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు

సాగర్‌కు పెరిగిన వరద ఉధృతి

జూరాల, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు జలకళ

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా బేసిన్‌లలోని ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టులు పూర్తిస్ధాయి నీటిమట్టానికి చేరుకుంటుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచివస్తున్న వరదతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2లక్షల 38 వేల 953 క్యూసెక్కుల ఇన్‌ఎఫ్లో ఉండగా.. 5 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.శ్రీశైలం నుంచి వస్తున్న వరదనీటితో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వానలకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు మరింత పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీలు ఉన్నది. ఇన్‌ఫ్లో 2 లక్షల 08 వేల 190 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఎ/-లో 7వేల 989 క్యూసెక్కులు ఉన్నది. ఈ నెల 22 నుంచి సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదను.. కిందకు అదేస్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్ష 39 వేలకు పైగా ఇన్‌ ఎ/-లో వస్తుండగా..16 గేట్లు ఎత్తి లక్ష 47వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 విూటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.10 విూటర్లు ఉన్నది. 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 9.645 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.

నిజామాబాద్‌ జిల్లాలోని ఎస్సారెస్పి ప్రాజెక్టుకి వరద ఉధృతి పెరుగుతోంది. 70వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను.. ప్రస్తుతం 1072 అడుగులకు నీటిమట్టం చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 36 టీఎంసీల నీరు చేరింది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కు 82 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 81 వేల 195 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.2029 టీఎంసీల నీరు ఉన్నది.

ఉమ్మడి ఆదిలాబాద్‌కు జలకళ

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. నిర్మల్‌ జిల్లా గ్డడెన్నవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.7 అడుగులు కాగా.. ప్రస్తుతం 358.5 అడుగులు ఉంది. ఇన్‌ఎ/-లో 6 వేల 750 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఎ/-లో 4,440 క్యూసెక్కులుగా ఉంది. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొమురం భీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 2 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.053 టీఎంసీలు ఉన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా నమోదవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ ఎ/-లో నమోదు అవుతుండగా రెండు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.3 టీఎంసీలు ఉన్నది. వైరా, పాలేరు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.