నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఘనత సీపీఐ ది.
-సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పెబ్బేటి విజయుడు.
-పెద్దకొత్తపల్లి మండలంలో సీపీఐ 98వ వారోత్సవాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్26 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో సీపీఐ 98వ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.వారోత్సవాలు లో భాగంగా వివిధ గ్రామాల లో జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్వకోలు మాజీ సర్పంచ్ కామ్రేడ్ పెబ్బేటి విజయుడు మాట్లాడుతూ 1925లో జూన్ 12న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో కామ్రేడ్ డాంగే ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఎంతోమంది బ్రిటిష్ వారి చేతిలో అమరులయ్యారని తెలిపారు.భారతదేశం లో 650 పైగా సంస్థానాలు ఉండేవని, కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారానే స్వాతంత్ర అనంతరం సంస్థానాలువిలీనం చేయడం జరిగిందని అన్నారు.తెలంగాణలో నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీదేనని అన్నారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ మగ్గం మైనుద్దీన్ ఆదినారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి బద్దంఎల్లారెడ్డి షేక్ బందగి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్రభాగాన ఉండి ఉద్యమాన్ని నడపడం జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది ప్రాణాలు అర్పించడం జరిగిందని అన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కామ్రేడ్ కామ్రేడ్ ఏసయ్య మండల అసిస్టెంట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ కల్వకుల్ శాఖ కార్యదర్శి కురుమయ్య ఐఐటీసీ అమలు సంఘం అధ్యక్షులు బాలస్వామి భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు ఆర్య శివ సీనియర్ నాయకులు సామయ్య నాగయ్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




