రుద్రంగి సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన ఆకుల గంగారం
రుద్రంగి డిసెంబర్ 26 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రానికి సెస్ డైరెక్టర్ ఎన్నికలు శనివారం జరగగా సోమవారం వేములవాడలో కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించారు.బిఆర్ఎస్ అభ్యర్థి ఆకుల గంగారం రుద్రంగి సెస్ డైరెక్టర్ గా సమీప స్వతంత్ర అభ్యర్థి అల్లాడి కృష్ణ ప్రసాద్ పై 36 ఓట్ల ఆదిక్యంతో ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు.బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఆకుల గంగారం డైరెక్టర్ గా విజయం సాధించడం పట్ల రుద్రంగి బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన గంగారం మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు రైతులకు, విద్యుత్ వినియోగదారులకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.అలాగే నా పై నమ్మకం ఉంచి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.తన వెంట ఉండి పది రోజులు తన విజయం కోసం కృషిచేసిన ఎంపీపీ స్వరూప మహేష్,జెడ్పిటిసి గట్ల మీనయ్య, వైస్ ఎంపీపీ భూమయ్య,మండలాధ్యక్షుడు తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్, ఎంపీటీసీలు,బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు మండల ప్రజా ప్రతినిధులు రైతులు విద్యుత్ వివాదాలు మేధావులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.




