న్యూఢిల్లీ : నితీష్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించింది కోర్టు. వికాస్, విశాల్ యాదవ్‌లకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షలు జరిమానా విధించింది. మరో నిందితుడు సుఖ్‌దేవ్ పహల్వాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. నితీస్ కటారాను ఫిబ్రవరి 17, 2002న వికాస్, విశాల్ యాదవ్ హత్య చేసిన విషయం తెలిసిందే.





