చైనా: దక్షిణ చైనా హ్యుడాంగ్ కౌంటీలోని బహుళ అంతస్తుల భవనంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. సదరు భవంతిలోని నాలుగో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భద్రత సిబ్బంది వెంటనే స్పందించి… అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు.
ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది… ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పి… సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహలు చాలా భాగం కాలిపోయాయని ఉన్నతాధికారులు తెలిపారు. సహయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




