Wednesday, 4 November 2026

నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లు 

– డిసెంబర్‌ 15నాటికి సభ్యత్వాలను పూర్తి చేయాలి
– చివరి ధర్మపోరాట సభలో జాతీయ స్థాయి నేతలు పాల్గొంటారు
– టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 2019 ఎన్నికల్లో గెలిచేవారికే టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు
స్పష్టం సంకేతాలిచ్చారు. ప్రజామోదం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, 2019 ఎన్నికలపై సవిూక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల్లో ఉండేవారికే పార్టీ తరపున ప్రాధాన్యత ఉండబోతుందని స్పష్టం చేశారు. 13రోజుల్లో సభ్యత్వ నమోదు 8.92 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఒక్కరోజే అత్యధికంగా 99,183 మంది సభ్యత్వం పొందారని గుర్తుచేశారు. డిసెంబర్‌ 15 కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల 20న నెల్లూరులో జరిగే ధర్మపోరాట సభను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే 27న విజయనగరంలో జరిగే ధర్మపోరాట సభను కూడా సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ధర్మపోరాట సభలు ఉంటాయని తెలిపారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఉమ్మడిగా చివరి ధర్మపోరాట సభ ఉంటుందని చెప్పారు. చివరి సభకు జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని తెలిపారు. ఈనెల 15,16 తేదీల్లో ‘జయ¬ బీసీ’ వర్క్‌షాప్‌ను జయప్రదం చేయాలన్నారు. బీసీ కులాల నేతలు హాజరై చర్చించాలని పేర్కొన్నారు. ఇంకా బీసీలకు చేయాల్సిన దానిపై దిశానిర్దేశం చేయాలని సూచించారు. నియోజకవర్గాలవారీగా టీడీపీ హమారా, దళిత తేజం సభలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.