– కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు
– కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, నవంబర్13(జనంసాక్షి) : గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చిందని, మిగిలిన స్థానాల్లోనూ గట్టి అభ్యర్ధులకే టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నీ సీట్లు కాంగ్రెస్‌కే వస్తాయని, మిగతా పక్షాల సహకారంతో విజయ ఢంకా మోగిస్తామని వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆయన అన్నట్లు చెప్పారు. నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ ఇచ్చి నాశనమైపోయిందన్నారు. అయితే నాలుగు కుటుంబాలు బాగుపడ్డాయని కోమటిరెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో గెలిచి సోనియాకు, రాహుల్‌కు రాష్ట్రానికి కానుకగా ఇవ్వాలన్నది తమ కోరికని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే అందరం బాగుపడతామని అనుకున్నామని, కానీ జరిగిందేవిూ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు న న్యాయం జరుగుతుందని అన్నారు.
గెలిచే అభ్యర్ధులకే.. అధిష్టానం టికెట్లు ఇచ్చింది




