జనం సాక్షి , మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం గ్రామం కి చెందిన పొలు శశికాంత్ పుట్టినరోజు సందర్భంగా సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం అయిన మంథని గ్రామంలోని మసీద్ వాడ లో కనపర్తి సత్యమ్మ కి ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేడగొని వెంకటేష్, వైస్ ప్రసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్ సభ్యులు ఐతు డేవిడ్, మాచిది మిట్టు, అరవింద్ పాల్గొన్నారు.




