Tuesday, 3 November 2026

బుద్ధ పౌర్ణమిని సెలవు దినముగా ప్రకటించాలి.

 

 

 

 

 

 

 

 

 

– ప్రపంచము,పక్కదేశము పాకిస్తాన్ పాటిస్తే మనం పాటించలేమా..!భైంసా రూరల్ జనవరి 29 జనం సాక్షీ

– అంబేద్కర్ మనవడు భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్…బుద్ధ పౌర్ణమిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సెలవు దినముగా ప్రకటించడం లేదంటూ…అంబేద్కర్ మనవడు భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ అన్నారు.ఆదివారం
నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చేరుకొన్న అయన బైంసా బస్టాండ్ ముందర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతోనివాళులర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.బౌద్ధూలకు సరైన గౌరవం దక్కడం లేదని బుద్ధ పౌర్ణిమను సెలవు రోజుగా ప్రకటిస్తే ఆగౌరవం దక్కుతుందన్నారు. బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని యావత్ ప్రపంచం సెలవు ప్రకటించి ఘనంగా నిర్వహిస్తారు. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం బుద్ధ పౌర్ణమి రోజున సెలవు ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందని, పక్క దేశం పాకిస్తాన్లో కూడా సెలవు దినం ప్రకటించడం చూస్తూనే ఉన్నామని ఇక్కడ ఎందుకు జరగడం లేదని వాపోయారు. బుద్ధ విహారలకు ప్రభుత్వం, సరియైన నిధులు స్థలాలు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. అనంతరం ముధోల్ మండలంలోని కనకాపూర్ గ్రామంలో బుద్ధవిగ్రహ ప్రతిష్టాపనకు బయలుదేరి వెళ్లారు.ఈయన వెంట పలువురు బౌద్ధ నాయకులు ఉన్నారు.