నిత్య జీవితం లో యోగ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్.

యోగ అనేది ఒక వర్గానికి, మతానికి సంభందించినది కాదు. రోగ రహిత సమాజం కోసం మన భారతీయ ఋషుల ద్వారా అందించబడిన మహా శాస్త్రం. మనిషిని నిరోగిని చేసే ఈ యోగ సాధనను ప్రపంచ మానవాళికి నేర్పించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేదిశగా మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఐక్యరాజ్యసమితిని ఒప్పించి  అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారత దేశం తోపాటు ప్రపంచం లోని అనేక దేశాలు నేడు యోగ సాధన చేస్తు ఆరోగ్యాంగా ఉంటున్నాయి అన్నారు *బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు*… భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా లో భారతీయ జనతా పార్టీ నాయకులూ కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయిలో ఈ రోజు యోగ దినోత్సవాన్ని నిర్వహించారు అన్నారు.
ఈ కార్యక్రమంలో *గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్.  మరియు జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు.