రోడ్డుపై వంటా… వార్పు కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ.
– సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి…
– మెట్ట ప్రాంతాలలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలి…
బూర్గంపహాడ్ నవంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం స్థానిక పరిధిలోని రామాపురం గ్రామ రోడ్డుపై సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వంటావార్ప కార్యక్రమం నిర్వహించారు. గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వమే పక్క ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సోమవారం బాధితులు నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేసి నిరసన తెలియజేశారు. గత 84 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ 437 సర్వే నెంబర్లోకి వచ్చిన గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమంను ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు నెలల కిందట గోదావరి ఉప్పొంగి ఇండ్లు మునిగిపోయి కట్టు బట్టలతో నిరశ్రయులు అయ్యారని వారి సమస్య పరిష్కారం కు, భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరామర్శకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తామని, మెట్ట ప్రాంతంలో పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని, వారి అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయల కేటాయిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికి హామీ ఇచ్చి కనీసం ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా మండల అధికారులకు జిల్లా కలెక్టర్ కు, అనేకమంది ప్రజాప్రతినిధులకు మా గోడు విన్నవించుకున్నప్పటికీ, కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని, కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్న తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజలే కూడు, గూడు, నీడ కోసం అడగడం దారుణమని వారన్నారు. ఈ మండలంలో ప్రభుత్వ భూమిని అనేకమంది భూస్వాములు స్వార్థపరులు ప్రజాప్రతినిధులు ఆక్రమించుకున్నారన్నారు. ఎంతోమంది పెట్టుబడిదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని మేము అడుగుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నామని, .సర్వే నెంబరు 10, 437,438,452,453,454 లలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ముంపు ప్రాంత ప్రజలకు కేటాయించాలని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైయస్ రెడ్డి, సత్యనారాయణ, బండ్ల వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు మణుగూరు ఏరియా అధ్యక్షుడు మలికంటి రాము, పావురాల లాలయ్య, లలిత, ఆర్ లక్ష్మి, జ్యోతి, కుంజభద్రమ్మ, ఎస్ డి జీనత్, కోరo మీనాక్షి, అనంతలక్ష్మి, రమాదేవి, బట్టు రవి, వహిద్ పాషా, ఎస్ డి రఫి, మనోజ్, లక్ష్మి, లక్ష్మణ్, శ్రీను, సునీత, రాణి ,తదితరులు పాల్గొన్నారు.




