రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రచండ భానుడు నిప్పులు గక్కుతున్నాడు. ఖమ్మం జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. భద్రాచలంలో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తగూడెంలో 46, మణుగూరులో 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. కరీంనగర్ జిల్లా రామగుండంలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదయ్యింది. కోల్ బెల్డ్ ఏరియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి.
నిప్పుల కొలిమిలా తెలంగాణ




