హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ విజిలెన్స్ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఏ అనుమతి లేకుండా నడిచే వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.




