హైదరాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : గణెళిష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీసు సిబ్బందికి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ప్యాట్నీలోని మహబూబ్ కాలేజీలో నిర్వహించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 21 కిలోవిూటర్ల మేర నిమజ్జనం పక్రియ ఉంటుంది అని సీపీ తెలిపారు. గణెళిష్ నిమజ్జనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. నిమజ్జనం జరిగే సమయంలో ప్రతి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిమజ్జనానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం ర్యాలీ సజావుగా జరిగేలా చూడాలి అని పోలీసులకు సీపీ సూచించారు.
నిమజ్జనం కోసం భారీ బందోబస్తు: సిపి




