Tuesday, 3 November 2026

నిమజ్జనానికి రెండ్రోజుల ముందే  మద్యం దుకాణాలు బంద్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  గణెళిష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తి వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని  ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. నిమజ్జనానికి నెండురోజుల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎక్డకా మద్యం సేవించి గొడవలకు దిగవద్దన్నారు. గణెళిష్‌ నవరాత్రి ఉత్సవ నిర్వహణ, శోభయాత్ర నిర్వహణపై జిల్లా అధికారులు, గణెళిష్‌ మండపాళ్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారికి తగు సూచనలు చేశామని అన్నారు.. జిల్లా కేంద్రంలో 11 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. మండపాల వద్ద భక్తి వాతావరణం పెంపొందించేలా నిర్వాహకులు చూసుకోవాలన్నారు.
నిమజ్జన శోభాయాత్ర నిర్వహించే రోజు కచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు. రెండు రోజుల ముందుగానే మద్యం దుకాణాలను మూసి వేయడం జరుగుతుందన్నారు. ప్రతీ గణపతి వాహనానికి జియో ట్యాగింగ్‌ ఉంటుందని, పోలీసుపరంగా భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలావుంటే
తానూర్‌ మండలంలోని బోసి గ్రామంలో ఉన్న కర్ర వినాయకుని దర్శనానికి భక్తులు  అధిక సంఖ్యలో వస్తున్నారు.  దూరప్రాంతాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో ఉదయం నిర్వహించే మంగళహారతి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి రోజూ అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ భక్తులకు కాగితపు కవర్లలో లడ్డూలను విక్రయిస్తున్నారు.