Saturday, 7 November 2026

నిమ్జ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి

నిమ్జ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి
జహీరాబాద్ డిసెంబర్ 24 (జనం సాక్షి) నిమ్జ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి అని మొగుడంపల్లి ఆశప్ప అన్నారు. శుక్రవారం సాయంత్రం నిమ్జ్ రైతుల తో సమావేశం అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారము అసైన్డ్ భూములైన పట్టా భూములైన సరి సమాన హక్కు దారులు కానీ ప్రభుత్వ అధికారులు గందరగోళమైన వాతావరణం కల్పిస్తూ ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వమే తీసుకుంటది అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఎకరానికి 15 లక్షల రూపాయలు ఇస్తామంటూ అధికారులే గందరగోళమైన వాతావరణ చూస్తున్నారు కావున ఏం ప్రామాణిక ప్రకారం ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి జీవో గాని దానికి సంబంధించినటువంటి ఆధారాల కు రైతులు నిలదీయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు రాఘవరెడ్డి, నాగేశ్వరరావు, రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజనర్సింహ, సంజీవరెడ్డి, సంగమేశ్వర్ పటేల్, గోపాల్ రెడ్డి, వీరన్న ,మక్బూల్, తదితరులు పాల్గొన్నారు.