మందిర నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల కు వినతిపత్రం*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 24,
జనంసాక్షి :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మేరు కుల దైవమైన శ్రీ శంకర దాసమయ్య మందిర నిర్మాణానికి కేటాయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు మేరు సంఘ సభ్యులు వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి వచ్చే నూతన సంవత్సరంలో తన నిధుల నుండి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన నిధుల నుండి సంఘ భవనము మరియు మందిర నిర్మాణానికి నిధులు కేటాయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మల్లాపూర్ మండల మేరు కుల సభ్యులందరూ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేరు కుల కార్యవర్గం మరియు కుల సభ్యులు పాల్గొన్నారు.
మందిర నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల కు వినతిపత్రం




