Saturday, 7 November 2026

సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం మరియు క్రిస్మస్ వేడుకలు డైరెక్టర్ కట్ట వెంకటరెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో శనివారం నాడు సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులుగా మారి తమ సహచర విద్యార్థులందరికీ చక్కగా పాఠాలు బోధించారు ఉపాధ్యాయులుగా తమ అనుభవాలను పంచుకున్నారు సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించారు, పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ కట్ట వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న చాచా నెహ్రు బాటలో విద్యార్థులు నడవాలని, విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు విద్యార్థినీ విద్యార్థులు తమ తల్లిదండ్రుల కళలను సాకారం చేసే దిశగా చదువుకుని మంచి ప్రభుత్వ కొలువులను పొంది దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు మరియు విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తోటి వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలని, ఇతరులను గౌరవించాలని, అబద్దం, మోసం, దొంగతనం, లాంటివి ఎప్పటికీ చేయకూడదని ఎంత ఇబ్బందులు బాధగా ఉన్నా నిజం మాట్లాడాలని మీరందరూ బాగా చదువుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పాఠాలు నేర్పిన గురువులు గర్వపడే విధంగా ఉండాలని తెలిపారు పేదరికం ఉన్నప్పటికీ నిజాయితీగా ఉండాలని సమాజాన్ని గౌరవించాలని, రాజ్యాంగపరంగా జీవించాలని తెలిపారు అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మరియు ఇతర విద్యార్థులు అందరికీ బహుమతులు ప్రధానం చేశారు మరియు పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు మరియు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులుఅందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి, కరస్పాండెంట్ మరియు ఉపాధ్యాయని, ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థినీ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలిపారు