Thursday, 5 November 2026

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతా 4.65 కోట్ల తో మరో మూడు రహదారులు

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతా
4.65 కోట్ల తో మరో మూడు రహదారులు
– ఇచ్చిన ప్రతి హామీని నెరేవేర్చే దిశగా ప్రభుత్వంని మెప్పించి నిధులు తెస్తున్న ఎమ్మెల్యే
– శాసనసభ్యులు సైదిరెడ్డి
హుజూర్ నగర్ డిసెంబర్ 8 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకునే మహా యజ్ఞంలో ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి భారీ నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తీసుకురావడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోవలోనే మరో మూడు రహదారులకు నాలుగు కోట్ల 65 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్స్ ని మంజూరు చేపించుకొని రావడం జరిగిందన్నారు. గత కొద్ది రోజుల క్రితమే నియోజకవర్గానికి నాలుగు డబులు రోడ్ల వంతెనలు, ఎనిమిది రహదారులను హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తీసుకువచ్చారన్నారు. మరో మూడు రహదారులతో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అద్దంలో తీర్చిదిద్దుతూ రోడ్లన్నిటిని రన్ వేలను తలపించేలా నిర్మించబోతున్నారు అన్నారు.
నూతనంగా మరో మూడు రహదారులు వివరాలు
1) ముసోడి తండా ..టు.. రామకృష్ణ తండా, నెరేడుచెర్ల 3.20KM..1.95cr 2) మిగడం పాడు తండా.. టు ..గుర్రంపోడు తండా పాలకీడు మండలం 2.50Km,1.75cr 3) సోమల తండా.. టు ..హనుమంతుల గూడెం గరిడేపల్లి మండలం, 1.20KM 0.95Cr. మొత్తం 4.65 కోట్ల నిర్మాణ వ్యయం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెప్పించి ఒప్పించి హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారన్నారు.