Thursday, 5 November 2026

వికలాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని తహసీల్దార్ కి వినతి.

వికలాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని తహసీల్దార్ కి వినతి.
నెరడిగొండడిసెంబర్ 8(జనం సాక్షి):పేద ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఇందులో భాగంగా వికలాంగులకు సొంత స్థలంలో నిర్మించుకొనుటకు రెండు పడకల ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ మండల వికలాంగుల అధ్యక్షుడు చవాన్ రమేష్ ఆధ్వర్యంలో గురువారం రోజున మండల తహసీల్దార్ పవన్ చంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో దాదాపు150 కంటే ఎక్కువ మంది వికలాంగులు కలరు అందు వలన డబుల్ బెడ్రూం కేటాయింపులో వికలాంగుల కోట ఉండేలా చూడాలని కోరారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు చవాన్ రమేష్ తోపాటు ప్రధాన కార్యదర్శి నర్సయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.