Friday, 6 November 2026

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి:తహశీల్దార్ విజయ సింహ

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి:తహశీల్దార్ విజయ సింహ

పెబ్బేరు డిసెంబర్ 08 (జనం సాక్షి):
ఓటర్ నమోదుపై
గురువారం పెబ్బేరు పురపాలక సమావేశ మందిరంలో తహసిల్దార్ విజయసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వయోజనుడు ఓటరుగా నమోదు చేయాలని బి ఎల్ ఓ లతో, ఆర్ పి లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తహసిల్దార్ విజయ సింహా తెలిపారు. కొత్త ఓటర్లు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో అంగన్వాడి టీచర్స్ వద్ద మొబైల్ లో, ఆన్లైన్ సెంటర్లలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. అందుకు అందరూ యువకులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సహకరించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు ఆధార్ కార్డు, ఫోటో, పదవ తరగతి చదివిన ధ్రువపత్రముతో బిఎల్ఓ లకు సమాచారం కొరకు డిసెంబర్ 25 వరకు ఇవ్వగలరని సమావేశంలో తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, మేనేజర్ గణేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.