:శామీర్ పేట్, జనంసాక్షి :వైద్యుల దినోత్సవం సందర్భంగా శనివారం శామీర్ పేట లో ని ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ వైద్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రి ప్రధాన వైద్యులు శ్రీకాంత్, దంత వైద్యులు మురళి, శృతి లను అఫ్జల్ ఖాన్ శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. వైద్యులు భగవంతుని స్వరూపులని , అందరికి సమానంగా వైద్యం చేసి మానవత్వాన్ని చాటుతారని అన్నారు. అఫ్జల్ ఖాన్ వైద్యులతో మాట్లాడుతు, రోగులకు మంచి వైద్యం అందించాలని,ఏ ఇబ్బందులున్న పరిష్కారం చేయ్యటానికి నాయకులమైన మేము ముందుంటామని హామీ ఇచ్చారు. ఘనంగా సన్మానించినందుకు వైద్యులు అఫ్జల్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ గౌస్, బుర్క వెంకటేష్, తాడెం కుమార్, మురళి చారి, పసుపుల నర్సింహ, బల్ రాం , క్రిష్ణ , సమీ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు భగవంతుని స్వరూపులు




