నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే నిరుద్యోగ నిరసన బహిరంగ సభను విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ ఏఐసీసీ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు.భహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవు తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా సరూర్ నగర్ లో జరిగే సభలో పాల్గొననున్నారని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే యువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని విమర్శించారు.రాష్రంలో 1.67లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నిండు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా వాటి భర్తీకీ నోచుకోలేదు అని అన్నారు. నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలకు పేపర్ లీకేజీలతో రాష్ట్ర ప్రభుత్వం పై నిరుద్యోగులకు నమ్మకం పోయిందని అన్నారు. నిరుద్యోగ నిరసన సభకు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ జిల్లాల నుండి ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరు పెద్ద ఎతున పాల్గొని విజయవంతం చేయాలని మల్లు రవి కోరారు.




