మల్కాజిగిరి.జనంసాక్షి.మే.ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం జెసిఐ,ఎల్ కె హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.ఈవైద్య శిబిరంలో 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశామని నిర్వాహకులు తెలిపారు.అనంతరంమల్కాజిగిరి ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిబిరాన్ని ప్రారంభించి యువకులకు ఆట వస్తువులను అందజేశారు.యువతి యువకులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జై కృష్ణ,నర్సింగ్,ప్రదీప్, శ్రీనివాస్,రాజు,కిరణ్,సంతోష్,శ్రీనివాస్, కృష్ణమూర్తి,బాల నరసింహ,సాయి తదితరులు పాల్గొన్నారు.




