Tuesday, 3 November 2026

శ్రీ మత్స్య గిరీంద్ర స్వామికి

..

 

 

 

 

అంగరంగ వైభవంగా చక్రస్నానం.. శ్రీ పుష్పయాగం..శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 6
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టుగుట్టపై గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా మత్స్య గిరింద్ర స్వామివారికి గుట్ట పైన గల కోనేరులో చక్రస్నానం, పుష్పయాగం, నాఖబలి, కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోత్సవాల నడుమ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మకర్తల మండలి చైర్మన్ సాగి మలహల్ రావు, గ్రామ సర్పంచ్ మొ కిరాల కిషన్ రావు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆశేష భక్త జనాల నడుమ ఆలయ ప్రధాన పూజారులు శేషం మురళీధరచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కోరం తిరుపతిరెడ్డి, మాడ తిరుపతిరెడ్డి ,కాసు తిరుపతి, ఉమ్మెoతల సుగుణాకర్ రెడ్డి, రామగిరి సునీత తీగల సంపత్, తో పటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.