Thursday, 5 November 2026

నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి

నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి,,,

బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్

హుస్నాబాద్ 29 నవంబర్ జనంసాక్షి

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణ కంటి నరేష్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా గాని తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నరేష్ అన్నారు
ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు 48 నెలలు గడుస్తున్నా గాని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు కావడం లేదని వారు అన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇప్పటివరకు ప్రతి నిరుద్యోగికి 48 నెలల నిరుద్యోగ భృతి ఒక్కో నిరుద్యోగి 1,44 768 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని
ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు వెంటనే నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో బిజెపి హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య బీజేవైఎం హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు రాంప్రతాప్ బీజేవైఎం నియోజకవర్గ నాయకులు జేరిపోతుల శ్రీనివాస్ బీజేవైఎం పట్టణ అధికార ప్రతినిధి ఆషాడపు శ్రీనివాస్ బీజేవైఎం పట్టణ కార్యదర్శి అప్పిడి లింగారెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు