Thursday, 5 November 2026

ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకు రాలు రాధా కుమారి

ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకు రాలు రాధా కుమారి

టేకులపల్లి, నవంబర్ 29( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో రోగులకు అందుతున్న నాణ్యత సేవలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర పరిశీలకురాలు( ప్రత్యేక అధికారి ) రాధాకుమారి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ రోగులకు అందుతున్న సేవల గురించి కూడా ఆమె స్వయంగా రోగులను అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరింత మెరుగైనవైద్య సేవలను అందించడానికి కావాల్సిన సూచనలు, సలహాలు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గన్యా, స్టాఫ్ నర్స్ వేదమణి, ఫార్మసిస్ట్ మంగీలాల్,సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జా విజయ, వీసం శకుంతల, ఏఎన్ఎం లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.