Thursday, 5 November 2026

నిరుద్యోగ మార్చుకు తరలిన బిజెపి నాయకులు

 

 

 

 

 

బచ్చన్నపేట ఏప్రిల్ 16(జనం సాక్షి)టీఎస్ పీఎస్ సీ ప్రశ్న పత్రాల లీకేజీ పై నిరసనకు బచ్చన్నపేట నుండి బిజెపి నాయకులు వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చౌరస్తాలో జరగబోయే నిరుద్యోగ మార్చుకు తరలి వెళుతున్నట్లు బచ్చన్నపేట బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి. బిజెపి జిల్లా ఉప అధ్యక్షుడు బేజాడి బీరప్ప జెండా ఊపి అధిక సంఖ్యలో వాహనాలను తరలించడం జరిగిందన్నారు.
మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్ ,బీజేవైఎం మండల అధ్యక్షుడు బంగారు మహేష్ ,మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా కర్యవర్గ సభ్యుడు సందీప్,సీతారాములు,రామయ్య ,శ్రీకాంత్,జలెందర్ రామ చంద్రం,నారయణ,భాస్కర్,రాంబాబు,రమేష్, బూత్ అధ్యక్షులు ,నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు