సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): బిక్షమయ్య గురూజీ ప్రత్యక్ష నిర్వహణలో శ్రీసత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 , 19వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ నందు నిర్వహించనున్న ఉచిత అంతర్ముఖ యోగ శిక్షణ తరగతుల కరపత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యోగ శిక్షణ తరగతుల నిర్వాహకులు మాట్లాడుతూ 18న సాయంత్రం పరిచయ కార్యక్రమం, 19న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యోగ శిక్షణ తరగతులు జరగనున్నట్లు తెలిపారు.ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు.యోగ శిక్షణా తరగతుల్లో అతి సరళమైన ఎక్సర్సైజులు, గురూజీ ప్రవచనాలు వీడియోల ద్వారా ప్రదర్శించినట్లు చెప్పారు.శిక్షణకు హాజరయ్యే వారికి అన్ని రకాల రుగ్మతలకు సంబంధించి సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ తరగతులను సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటి శ్రీనివాస్ గురూజీ, భూక్య బాలాజీ నాయక్, కొలిశెట్టి శ్రీనివాస్, సాయిమనోజ్, కీర్తన, సరిత తదితరులు పాల్గొన్నారు.




