గద్వాల నడిగడ్డ ఏప్రిల్ 15 (జనం సాక్షి);పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏకైక ఎజెండాతో పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ పేరుతో ఆదివారము ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి బయలుదేరి వైయస్సార్ సర్కిల్ పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ ఉంటుందని, ర్యాలీకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని టీఎస్ సీపీఎస్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్ సీపీఎస్ ఈయు తలపెట్టిన ఈ భారీ ర్యాలీ కార్యక్రమానికి జిల్లాలోని మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని పాత పెన్షన్ సాధించడం కోసం జరిగే పోరాటంలో ముందు వరసలో మేము ఉంటామని గద్వాల జిల్లా మహిళా ఉద్యోగులు తమ పోరాటపటిమను ప్రకటించారని, తమ హక్కు అయినా పెన్షన్ సాధించేందుకు ఎంతవరకైనా పోరాటం నకు సిద్ధమని జిల్లా మహిళా కమిటీ సభ్యులు వెంకట నరసమ్మ, దానమ్మ ,సుధారాణి, వెంకటలక్ష్మి స్పష్టం చేశారని ఆయన అన్నారు.
నేడు తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు గడిచిన కొన్ని రోజులుగా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశాలకు హాజరవుతున్న ఉద్యోగుల నుంచి ప్రతిస్పందన అద్భుతంగా ఉందని పాత పెన్షన్ సాధించాల్సిన ఆవశ్యకత, అంశములపై ఉద్యోగులు చాలా స్పష్టంగా ఉన్నారని, ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా తమ ఆకాంక్షను ఆవేదనను ప్రభుత్వానికి స్పష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారని, నేటి సన్నాహక కార్యక్రమంలో గద్వాల డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ స్రవంతి, సీసీ వెంకటేష్, రాష్ట్ర సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రాజారెడ్డి, సుజాత, వెంకటేష్ ,జిల్లా నాయకులు నాగరాజు ఉన్నవాడ రమేష్ శ్యాంసుందర్, తిరుమలరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారనీ అధ్యక్షులు నాగరాజు తెలిపారు




