Thursday, 5 November 2026

నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పిస్తూ అండగా నిలిచిన మినరల్ డెవలపెమెంట్ కార్పొరేషన్ చైర్మన్ : మన్నే కృషాంక్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 09 సికింద్రాబాద్ కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ మెగా జాబ్ మేళా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే కృషాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, కంటోన్మెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి ప్రారంభించారు.కంటోన్మెంట్ నియోజకవర్గ యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పన చేయాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే కృషాంక్ తెలియజేశారుఈ సందర్భంగా కృశాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు,యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని,చదువుకున్న యువత పెడదారి పట్టకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో వారికి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఏడవ తరగతి నుండి పీజీ చేసిన నిరుద్యోగు లందరికీ వివిధ విభాగాలలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని అన్నారు. ఈ మెగా జాబ్ మేళా లో ప్రముఖ ప్రసిద్ధి చెందిన టాటా కన్సల్టెన్సీ, విప్రో, టెక్ మహేంద్ర వంటి
దాదాపు 110 కంపెనీల సహకారం తో 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఐటి రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి పరుస్తూ విదేశాల నుండి అనేక కంపెనీల ద్వారా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తు తెలంగాణ ప్రభుత్వం ముందు ఉందని అన్నారు.జాబ్ మేళాకు విశేష స్పందన లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యుడు ప్రభాకర్, బిఆర్ఎస్ నాయకులు పెద్దల నరసింహ, శ్రీకాంత్, ప్రభు గుప్తా,మధుకర్, సురేష్,మోని,రఘు,పహేం,కిరణ్,సాయి,శీను, తదితరులు పాల్గొన్నారు.