Thursday, 5 November 2026

మానవత్వాన్ని చాటుకున్న ఎంపీ బీబీ పాటిల్

బిచ్కుంద జూన్ 09 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయి పేట శివారులోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం నాడు మద్యాహ్న సమయంలో ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీకొని ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అదే సమయంలో సంగారెడ్డి వైపు నుండి జోగిపేటకు వెళ్తున్న జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ బి.బి పాటిల్ తన వాహనాన్ని అపి క్షతగాత్రులను పరామర్శించి హాస్పిటల్ కి తరలించారు. రోడ్డు ప్రమాదంలో గాయాలైన మొగులయ్యకు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.