Thursday, 5 November 2026

నిరుపేదలకు అండగా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ

నిరుపేదలకు అండగా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ

మోత్కూరు డిసెంబర్ 15 జనంసాక్షి : మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఎడమ మల్లమ్మ ఇటీవల మరణించగా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ సభ్యులు మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ఏర్పడ్డ మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేయడానికి ముందు ఉంటూ నిరుపేద కుటుంబమైన లక్ష్మమ్మ సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సాయి, నరేందర్, చింటూ,నరేందర్ పాల్గొన్నారు.