మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలి.
-తెలంగాణ రైతు సంఘం డిమాండ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్15(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో మిర్చి పంటకు తెగుళ్లు వలన మిర్చి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.వివిద డిమాండ్ తో కూడిన వినతిపత్రం జిల్లా అధికారులకు ఇచ్చారు. ఈ ధర్నాను ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల లక్ష్మణ్,రైతు రాగి నారాయణరెడ్డి
మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బిజినాపల్లి తాడూరు తెలకపల్లి నాగర్ కర్నూల్ అమ్రాబాద్ ఇతర మండలాల్లో ఖరీఫ్‌లో మిర్చి పంటను అధికంగా సాగు చేశారని అధిక వర్షాలు రావడంతో వైరస్ సోకి కల్తీ విత్తనాల వలన తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు వ్యవసాయ అధికారులు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలకపల్లి మండలంలోని కారువంగ గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు పంట నష్ట వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారని ఆయన అన్నారు. మిర్చి పంట సాగుచేసిన రైతులు ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారని ఎకరాకు 14 వేల రూపాయలు కౌ లు చెల్లించి సాగు చేశారని చివరికి కౌలు కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని తక్షణమే జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పంట నష్ట వివరాలు సేకరించి రైతులకు పరిహారం ఇప్పించాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశీయ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కల్తీ విత్తనాలు రాజమేలుతున్నాయని, విత్తనాలు అమ్మే డీలర్లు లబ్ధి పొందుతున్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని నష్టపోయిన పంటలు వివరాలు సేకరించి పరిహారం చెల్లించే విధంగా ప్రయత్నించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు గౌడు జిల్లా కమిటీ సభ్యులు వి వెంకటేష్ ఎండి మాలిక్ జి శంకర్ బాలరాజు కురుమయ్య రైతులు రాగి నారాయణరెడ్డి గోరటి కాశన్న కోడెల భగవంతు ఆనందు శశిధర్ రెడ్డి మల్లేష్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.




