నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని మహిళల ధర్నా కొండమల్లేపల్లి డిసెంబర్ 1 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో గురువారం నాడు మహిళలు ధర్నా చేసి మాట్లాడుతూ నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని పట్టణ కేంద్రంలోని జంగాల కాలనీలో కొంతమంది మహిళలు నిరుపేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పరువులు మహిళలు మాట్లాడుతూ మాకు ఉండడానికి ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కిందని ఇండ్లు లేనటువంటి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ సంవత్సరాలు గడుస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని అన్నారు గతంలో పట్టణంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాన్ని ఇండ్లు ఉన్నటువంటి వారికి ఇండ్లను ఇచ్చారు కానీ నిరుపేదలకు ఎవరికి ఇండ్లు ఇవ్వలేదని మహిళలు తెలిపారు వెంటనే ప్రభుత్వం ఇండ్లు లేనటువంటి నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు కోటమ్మ శంకరమ్మ గెలువమ్మ అంజమ్మ అలివేలు సుజాత చంటి వెంకటేష్ అలివేలు తదితరులు పాల్గొన్నారు
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని




