బొడ్రాయి పండుగలో ముస్లీమ్ సోదరులు :శామీర్ పేట్, జనం సాక్షి :
గురువారం శామీర్ పేట లో బొడ్రాయి పండుగ కోసం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ రెండు వేల ఒక వంద రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు బొడ్రాయి పండుగ సందర్భంగా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత బొడ్రాయి పండుగ చేయటం జరుగుతుందని, గ్రామస్థులందరికి శుభం జరగాలని కోరుకుంటున్నట్లు అఫ్జల్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్,ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, వార్డు సభ్యులు ఉప్పలయ్య, దూడల శ్రీకాంత్ గౌడ్, సత్య నారాయణ, రవిందర్,దెశం శ్రీకాంత్ గౌడ్, బాబు, సుధాకర్,బుర్క మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.
1ఎస్పీటీ -3: బొడ్రాయి పండుగకు విరాళం అందజేస్తున్న ఆఫ్జాల్ ఖాన్
బొడ్రాయి పండుగలో ముస్లీమ్ సోదరులు :శామీర్ పేట్




