మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణ వాసవి క్లబ్, వనిత క్లబ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పింఛన్ పథకం అభినందనీయమని వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ రాయపూడి భవాని అన్నారు. శుక్రవారం స్థానిక వాసవి భవన్ లో వాసవి క్లబ్ వనిత క్లబ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గత నెల నుండి సంవత్సరం పాటు చేపట్టిన ఫించన్ పధకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ పింఛన్ పథకం అందరికి ఆదర్శం గా నిలిచి మరింత మంది నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు తోడ్పాటు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 30 మంది పేద మహిళలకు పింఛన్లు అందించారు.కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ బోనగిరి లావణ్య దాతలు తిరునగరి రోజా రాణి , వనమా వాణి,
వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు కొప్పురావూరి రమాదేవి ,కోశాధికారి పైడిమరి ఉషాబాల,
వాసవీ వనిత కుసుమంబ జనరల్ సెక్రెటరీ తల్లం పుష్పావతి ,కోశాధికారి గౌరు లత తదితరులు పాల్గొన్నారు.




